శ్రీలీల ప్లేస్ లో రవీనా టండన్ కూతురు?

శ్రీలీల ప్లేస్ లో రవీనా టండన్ కూతురు?
X
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ముదస్సర్ అజీజ్, నిర్మాతలు ఇప్పుడు రవీనా టండన్ కూతురు రషా థడానీని ఈ హాస్య చిత్రంలో నటించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది నుంచి తెలుగుతో పాటు కన్నడ చిత్రాలలో నటించిన శ్రీలీలా.. కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి ‘పతి పత్ని ఔర్ వో 2’ లో మూడో ప్రధాన పాత్రలో కనిపించనున్నట్టు గట్టి ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ముదస్సర్ అజీజ్, నిర్మాతలు ఇప్పుడు రవీనా టండన్ కూతురు రషా థడానీని ఈ హాస్య చిత్రంలో నటించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

శ్రీలీలాకు ఇది బాలీవుడ్‌లో రెండో సినిమా అయ్యేది. ప్రస్తుతానికి, ఆమె అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ సరసన తన తొలి హిందీ ప్రేమ కథా చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా ప్రస్తుతం సిలిగురిలో చిత్రీకరణ దశలో ఉంది. అయితే ‘పతి పత్నీ ఔర్ వో 2’ టీమ్ మాత్రం కొత్త జంటను ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తోంది.

"శ్రీలీలా, కార్తిక్ ఇప్పటికే అనురాగ్ బసు సినిమాతో కలిసి పని చేస్తున్నారు. దీంతో ముదస్సర్ అజీజ్ నేతృత్వంలోని ‘పతి పత్నీ ఔర్ వో 2’ టీమ్ కొత్త జోడిని ఆవిష్కరించాలని భావిస్తోంది. రషా థడానీకి ఇటీవల విడుదలైన ఆజాద్ చిత్రంలో ‘ఉయి అమ్మా’ పాట ద్వారా మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు ముదస్సర్ త్వరలో లుక్ టెస్టులు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారు" అని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2019లో విడుదలైన ‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్ చిత్రీకరణ అనురాగ్ బసు ప్రేమకథ పూర్తయిన తర్వాత ప్రారంభం కానుంది.

Tags

Next Story