రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ హీరోయిన్ ఎవరు?

రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ హీరోయిన్ ఎవరు?
X

ఇటీవల ‘డాన్ 3’ లో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించనున్న హీరోయిన్‌పై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ నడిచింది. మొదట కియారా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆమె గర్భవతి కావడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కృతి సనన్, శర్వరి వంటి పేర్లు పోటీలోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. శర్వరి హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి.. ఆమె ఇప్పటికే సైన్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి.

ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు రణ్‌వీర్‌తో కలిసి షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, శర్వరిని ఇటీవల కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న ‘ఆశికీ 3’ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇంకా.. ఆమెను అయుష్మాన్ ఖురానా, సూరజ్ బర్జాత్యా కాంబో చిత్రానికి ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో శర్వరి కెరీర్ స్ట్రాంగ్ లైనప్ తో ముందుకు సాగుతోందని చెప్పొచ్చు.

Tags

Next Story