‘మర్దానీ 3’ కొత్త పోస్టర్ వచ్చింది !

నవరాత్రి మొదటి రోజున.. ‘మర్దానీ 3’ చిత్ర నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించారు. ఇందులో మంచికి, చెడుకి మధ్య తీవ్రమైన పోరాటం జరగబోతుందని సూచించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టర్‌లో హీరోయిన్ రాణీ ముఖర్జీ చేయి ఒక నల్లటి హ్యాండ్‌గన్‌ను గట్టిగా పట్టుకుని కిందకు చూపిస్తున్నట్లు ఉంది. వెనుక వైపు 'ఢిల్లీ పోలీస్' అని రాసి ఉన్న పసుపు రంగు పోలీస్ బారికేడ్ అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ విజువల్ రాబోయే థ్రిల్లర్‌కు ఒక గ్రిట్టీ టోన్‌ను అందిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో “నవరాత్రి మొదటి పవిత్రమైన రోజున, మంచిపై చెడు సాధించే విజయాన్ని జరుపుకుందాం...” అంటూ పండుగ స్ఫూర్తిని జోడించారు. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ తన ఐకానిక్ పాత్ర శివానీ శివాజీ రాయ్‌గా తిరిగి వస్తుందని, ఆమె కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన కేసులలో ఒకదానిని డీల్ చేస్తుందని నిర్ధారించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజ్ అభిమానులలో చాలా ఉత్సాహాన్ని నింపింది.
అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహిస్తున్న ‘మర్దానీ 3’ మూవీ బాలీవుడ్ లోనే అత్యంత ప్రసిద్ధ విమన్ సెంట్రిక్ ఫ్రాంఛైజ్‌లలో ఇది తాజా భాగం. 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘మర్దానీ’ సిరీస్ దాని గ్రిప్పింగ్ కథనం, హై-స్టేక్స్ డ్రామా, ఒక నిర్భయమైన పోలీసు అధికారిణి ప్రమాదకరమైన నేరస్థులను ఎదుర్కొనే విధానాన్ని చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫ్రాంఛైజ్ సంవత్సరాలుగా ప్రేక్షకులలో ఒక కల్ట్ స్టేటస్‌ను సాధించింది. దాని బలమైన మహిళా పాత్రకు ఇది ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది. మరి గత రెండు భాగాల్లాగానే ఈ భాగం కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
-
Home
-
Menu