రణదీప్ హుడా ‘ఆపరేషన్ ఖుక్రీ’

రణదీప్ హుడా ‘ఆపరేషన్ ఖుక్రీ’
X
మంచి టాలెంటెడ్ యాక్టర్ అయిన రణదీప్ హుడాతో భారత సైన్యం చేపట్టిన అత్యంత ధైర్యవంతమైన శాంతి పరిరక్షణ మిషన్‌ను ఆధారంగా తెరకెక్కించబోతున్న వార్ డ్రామా ‘ఆపరేషన్ ఖుక్రీ’. ఇందులో రణదీప్ మెయిన్ లీడ్ లో నటించబోతున్నాడు.

‘జాట్’ సూపర్ సక్సెస్ తర్వాత, రణదీప్ హుడా మరోసారి యుద్ధభూమిలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఈసారి.. ఒక నిజమైన ధైర్యం, త్యాగం, అద్భుతమైన గట్స్ కలిగిన కథను చెప్పడానికి వస్తున్నాడు. మంచి టాలెంటెడ్ యాక్టర్ అయిన రణదీప్ హుడాతో భారత సైన్యం చేపట్టిన అత్యంత ధైర్యవంతమైన శాంతి పరిరక్షణ మిషన్‌ను ఆధారంగా తెరకెక్కించబోతున్న వార్ డ్రామా ‘ఆపరేషన్ ఖుక్రీ’. ఇందులో రణదీప్ మెయిన్ లీడ్ లో నటించబోతున్నాడు.

2000 సంవత్సరంలో జరిగిన ఈ కథ... పశ్చిమ ఆఫ్రికాలోని సియెరా లియోన్‌లోని యుద్ధ-పీడిత కైలాహున్ జంగిల్‌లో, తిరుగుబాటు దళాలచే బందీలుగా పట్టుబడిన 233 మంది భారత సైనికులను రక్షించిన ఒక ధైర్యవంతమైన ఆపరేషన్‌ను ఆవిష్కరిస్తుంది. ఈ అత్యంత ప్రమాదకరమైన మిషన్‌కు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజ్ పాల్ పూనియా, అప్పట్లో ఒక యువ కంపెనీ కమాండర్‌గా ఉన్నారు. 75 రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్, ఆధునిక చరిత్రలో అత్యంత ధైర్యవంతమైన సైనిక దాడుల్లో ఒకటిగా నిలిచింది.

రణదీప్ హుడా ఈ చిత్రంలో మేజర్ జనరల్ పూనియా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ మిత్రా ఫిల్మ్స్ మరియు రణదీప్ హుడా ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన ఆపరేషన్ ఖుక్రీ: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్‌కీపింగ్ మిషన్ అబ్రాడ్ అనే బెస్ట్‌సెల్లర్ నుండి కథను అధికారికంగా స్వీకరించారు. మరి ఈ సినిమా రణదీప్ హుడాకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags

Next Story