మరో హాలీవుడ్ మూవీలో నటిస్తున్న రణదీప్ హుడా

ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెజ్లర్ అయిన జాన్ సీనాతో బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా.. కలిసి నటించబోతున్నాడు. ‘మాచ్‌బాక్స్’ అనే మూవీలో కలిసి నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమాకు ప్రసిద్ధ దర్శకుడు సామ్ హార్గ్రేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020లో విడుదలైన ‘ఎక్స్‌ట్రాక్షన్’ చిత్రంలో సాజు పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రణదీప్.. ఈ సినిమాలో కూడా సామ్ హార్గ్రేవ్‌తో రెండవ సారి కలిసి పనిచేస్తున్నాడు.
ఈ సందర్భంగా రణదీప్ హుడా ఒక ప్రకటనలో తెలిపాడు. “సామ్‌తో మళ్లీ పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఎక్స్‌ట్రాక్షన్’లో మొదటిసారి కలిసి చేసిన పనిలో మంచి అనుభవం లభించింది. సామ్.. యాక్షన్ చిత్రాలు తీయడంలో మాస్టర్. బుడాపెస్ట్‌లో ‘మాచ్‌బాక్స్’ బృందంలో చేరడం సంతోషంగా ఉంది” అని తెలిపాడు. సామ్ హార్గ్రేవ్ ‘ఎక్స్‌ట్రాక్షన్ 1, 2’ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘ఇన్ఫినిటీ వార్’, ‘థోర్-రాగ్నరోక్’, ‘స్యూసైడ్ స్క్వాడ్’ వంటి పలు చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పేరుగాంచాడు. ‘మాచ్‌బాక్స్’ చిత్రాన్ని మ్యాటెల్ ఫిల్మ్స్, స్కైడాన్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం బుడాపెస్ట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇక రణదీప్ హుడా ప్రస్తుతం ‘జాట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్‌తో కలిసి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
-
Home
-
Menu