గ్లోబల్ రేంజ్ లో రణబీర్ ‘రామాయణం’ నిర్మాణం !

బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రామాయణం' ఒకటి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటమే కాకుండా.. గ్లోబల్ స్థాయిలో భారతీయ కథనాన్ని నిలబెట్టాలని నిర్మాత నమిత్ మల్హోత్రా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ వీఎఫ్ ఎక్స్ స్టూడియో డీయన్ఈజీ అధినేత నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా తెర కెక్కించబోతున్నారు మేకర్స్. 'రామాయణం' సినిమాను ‘ఓపెన్‌హైమర్, ఫారెస్ట్ గంప్’ చిత్రాల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వినిపించే గొప్ప అవకాశం ఇది. ఇది నా జీవితంలో వచ్చిన అత్యంత ముఖ్యమైన అవకాశాల్లో ఒకటి. దీన్ని గొప్పగా అందించగలనని ఆశిస్తున్నాం అని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే ‘ఇంటర్‌స్టెల్లార్, డ్యూన్’ లాంటి ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న నమిత్ మల్హోత్రా.. భారతీయ సినిమాకు కూడా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. అయితే, ఇదొక భారీ బాధ్యత అని కూడా గుర్తించారు.
గతంలో 'రామాయణం' ఆధారంగా అనేక సినిమాలు వచ్చినప్పటికీ.. ఇటీవల వచ్చిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తమ చిత్రం అలా కాకుండా కథను సముచితంగా చెప్పే విధంగా తెరకెక్కించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మల్హోత్రా తెలిపారు. "దీన్ని ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఇది భారతీయ సినీ పరిశ్రమకు తగిన సమయం," అని ఆయన అన్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రామాయణ గాథలో రణబీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దుబే, అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు
-
Home
-
Menu