ఎరోప్లేన్ మోడ్ లో రణబీర్ కపూర్ !

బాలీవుడ్ లో డెడికేషన్ కు మారుపేరు రణబీర్ కపూర్. తన నటనపట్ల ఆయన చూపే అంకితభావం అందరినీ బాగా ఇన్స్పైర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో రణబీర్ కపూర్ కఠినమైన కాలిస్టెనిక్స్ వర్కౌట్‌ను ఎంతో సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోస్ట్‌ను రణబీర్ ఫిట్‌నెస్ ట్రైనర్ నామ్ షేర్ చేశారు. అతడు దీనికి.. "ఎరోప్లేన్ మోడ్ ఆన్" అనే క్యాప్షన్ ఇచ్చాడు.
ఫిబ్రవరిలో... రణబీర్ కపూర్ తన లేటెస్ట్ మూవీ "లవ్ అండ్ వార్" కు సంబంధించిన కోస్టార్స్ ఆలియా భట్, విక్కీ కౌశల్‌తో కలిసి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలియా భట్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. "నైట్ షూట్స్‌కి చిన్న బ్రేక్ తీసుకుని మా డైరెక్టర్‌ని సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్‌డే మ్యాజీషియన్ సార్! అంతేకాక విక్కీ కౌశల్ 'చావా'తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నందుకు బోలెడు అభినందనలు. ఛలో.. పార్టీ ముగిసింది... తిరిగి షూట్‌కి వెళదాం" అంటూ రాసుకొచ్చింది.
"లవ్ అండ్ వార్" సినిమాతో భన్సాలీ, రణబీర్ కపూర్ మరోసారి కొలాబరేట్ అవుతున్నారు. వీరిద్దరూ గతంలో "సావరియా" చిత్రానికి తొలిసారిగా కలిసి పనిచేశారు. ఈ సినిమా రణబీర్ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ అని తెలిసిందే. ఇది కాకుండా... రణబీర్ ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న "రామాయణం" చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆయన తొలిసారిగా రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి, యశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
-
Home
-
Menu