మే నెలాఖరులోగా పార్ట్ 2 షూటింగ్ !

మే నెలాఖరులోగా పార్ట్ 2 షూటింగ్ !
X
ఇప్పటికే ‘రామాయణ: పార్ట్‌ 1’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు రెండో భాగానికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. మే నెలాఖరులోగా 'రామాయణ: పార్ట్‌ 2' షూటింగ్ ప్రారంభం కానుంది.

బహుభాషా చిత్రాల పరంపరలో యశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘టాక్సిక్‌’ తో పాటు ‘రామాయణ’ కూడా ప్రత్యేకస్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ రెండేళ్ళ పాటు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు.

ఇప్పటికే ‘రామాయణ: పార్ట్‌ 1’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు రెండో భాగానికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. మే నెలాఖరులోగా 'రామాయణ: పార్ట్‌ 2' షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా సీత పాత్రకు సంబంధించి అశోక వనం ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

జూన్‌ నుండి రణ్‌బీర్‌పై రాముడి పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, రణ్‌బీర్‌, సాయిపల్లవి పై రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ భారతీయ ఇతిహాస చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Tags

Next Story