‘ధూమ్ 4’ లో రామ్ చరణ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో స్ర్కీన్ షేర్ చేసు కోనున్నట్టు వార్తలొస్తున్నాయి. ‘ధూమ్ 4’లో కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నారనే రూమర్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ రామ్ చరణ్‌ని సంప్రదించినట్లు సమాచారం. కానీ అతని టీమ్ నుంచి ఇంకా అధికారిక సమాధానం రాలేదు.
ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో హైప్ క్రియేట్ చేస్తుండగా.. తెలుగు ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించాలని కోరుకుంటున్నారు. ‘వార్ 2’లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర అంచనాలను అందుకోలేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.
ఇదే తరహాలో బాలీవుడ్ మల్టీస్టారర్‌లో రామ్ చరణ్ సత్తాను సరిగ్గా ఉపయోగించుకోకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ అనే సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2025లో భారీ రిలీజ్‌గా రానుంది.
-
Home
-
Menu