సైఫ్ ఆలీఖాన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ?

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ‘రేస్ 4’లో ప్రధాన పాత్రలో తిరిగి కనిపించ నున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించే అవకాశముంది. అయితే.. రకుల్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుందా లేదా అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్ ఏదీ లేనందున.. ఆమె ‘రేస్ 4’లో భాగమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక ‘రేస్ 4’ ఫ్రాంచైజీకి మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. రకుల్ ఈ సినిమాపై చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రల కంటే భిన్నంగా.. కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్ నటించిన నటించిన ‘మేరి హస్బెండ్ కి బివి’ మంచి విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు కెరీర్‌ను మరింత మలుపుతిప్పే సమర్థమైన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. ‘రేస్ 4’ కూడా ఆమె కెరీర్‌కు ఓ ప్రత్యేకమైన చిత్రం అవుతుంది” అని తెలిపారు.
34 ఏళ్ల రకుల్ ఇప్పటి వరకు అనేక రకాల చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఆమె రొమాంటిక్ కామెడీ జానర్‌లో మంచి పట్టు సాధించింది. అయితే, యాక్షన్ థ్రిల్లర్‌గా పేరుగాంచిన ‘రేస్’ సిరీస్‌లో భాగమవడం ఆమె కెరీర్‌లో మరింత వైవిధ్యం తెచ్చే అంశం. ఆమె పాత్ర, ఆమె సైఫ్‌తో జతకడతారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. ఇక ‘రేస్ 4’లో సైఫ్ అలీ ఖాన్ తిరిగి నటించ నుండడం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఏడాది, ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని సిద్ధం చేస్తున్నాం మేకర్స్. ప్రస్తుతం కథను, నటీనటులను ఫైనల్ చేస్తున్నారు. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే ముందు అధికారికంగా ప్రకటిస్తారు.
-
Home
-
Menu