‘రైడ్ 2’ రిలీజయ్యేది అప్పుడే !

బాలీవుడ్ యాక్షన్ డైనమైట్ అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో నటించిన ‘రైడ్’ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. 2018లో రిలీజైన ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న చిత్రం ‘రైడ్ 2’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఐఏయస్ అధికారి అమయ్ పట్నాయక్ మరో కొత్త కేసును విచారణ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా మే 1 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈసారి కథ కొత్త నగరంలో... కొత్త కేసుతో... కొత్త ఛాలెంజ్‌లతో ముందుకు సాగుతుంది. వైట్-కాలర్ నేరాలపై మరో తీవ్రమైన దర్యాప్తు కథాంశంగా రూపొందించబడిన ఈ సినిమాలో... వాణీ కపూర్ ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. ఆమె ఇలియానా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. అలాగే, రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, అభిషేక్ పాఠక్, కృష్ణ కుమార్, గౌరవ్ నందా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మరోసారి అజయ్ దేవ్‌గన్ తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
-
Home
-
Menu