భారతీయ సైంటిస్ట్ జి.డి. నాయుడుగా ఆర్. మాధవన్ !

ప్రముఖ భారతీయ సైంటిస్ట్ ఇంజినీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ "జి.డి. నాయుడు". ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇండియన్ షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణకుమార్, రామకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ ను మాధవన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నాడు. "మీ అందరి ఆశీర్వాదాలు, మంచి కోరికలు మాకు కావాలి" అంటూ రాసిన ఆయన.. "ఇండియా షెడ్యూల్ బిగిన్స్" అని ఉన్న సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు.
జి.డి. నాయుడు భారతదేశానికి ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’ గా పేరొందారు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ తయారీకి ఆయన బహుముఖ ప్రతిభను చూపారు. యాంత్రిక, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఆయన చేసిన విప్లవాత్మక ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమైనవి. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. జయరామన్, యోగి బాబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వర్గీస్ మూలాన్స్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిల్మ్స్, మీడియా మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది.
మాధవన్ కు నిజ జీవిత పాత్రను పోషించడం మొదటిసారి కాదు. 2022లో "రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్" చిత్రంలో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రను పోషించి, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇటీవల మాధవన్ జీ5 లో విడుదలైన "హిసాబ్ బరాబర్" చిత్రంలో నటించాడు. తదుపరిగా ఫాతిమా సనా షేఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఆప్ జైసా కొయి" లో కనిపించనున్నాడు. ఇప్పుడు మాధవన్ సినిమాల లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. "కేసరి 2 – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్", "దే దే ప్యార్ దే 2", "ధురంధర్" చిత్రాలు లైన్ లో ఉన్నాయి.
Tags
- Famous Indian scientist engineer Gopalaswamy Doraiswamy Naidu
- biopic "G.D. Naidu"
- famous Tamil actor R. Madhavan
- Krishnakumar
- Ramakumar
- Edison of India
- Jayaraman
- Yogi Babu
- Priyamani
- Varghese Moolans Pictures
- Tricolor Films
- Media Max Entertainment banners
- "Rocketry: The Nambi Effect"
- former ISRO scientist Nambi Narayanan
- Hisaab Barabar"
- Fatima Sana Sheikh
- Aap Jaisa Koi
- Kesari 2 – The Untold Story of Jallianwala Bagh"
- "De De Pyaar De 2"
- "Dhurandhar"
-
Home
-
Menu