‘పుష్ప 2’ రికార్డు ఇంకా అలాగే ఉంది !

‘పుష్ప 2’  రికార్డు ఇంకా అలాగే ఉంది !
X
అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2" ఇప్పటికీ హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనే రికార్డును కొనసాగిస్తోంది. కొన్ని బాక్సాఫీస్ విశ్లేషకుల ప్రకారం, హిందీ వెర్షన్ వసూళ్లు రూ.800 కోట్ల దాకా వెళ్లినట్టు చెబుతున్నారు.

45 రోజులు పూర్తి చేసుకున్న విక్కీ కౌశల్ నటించిన "ఛావా" సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌కు చేరువవుతోంది. అయితే ఈ సినిమా థియేటర్స్ నుంచి తప్పుకునే సమయం దగ్గరపడటంతో.. ఇక దాని వసూళ్లు మినిమల్‌గా ఉంటాయనే అనుకోవచ్చు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ హిందీ సినిమా, దేశవ్యాప్తంగా విస్తృతంగా విజయాన్ని అందుకోవాల్సిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ వసూళ్లు సాధించినా, దేశవ్యాప్తంగా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, "పుష్ప 2" స్థాయిని అధిగమించలేకపోయింది.

అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2" ఇప్పటికీ హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనే రికార్డును కొనసాగిస్తోంది. కొన్ని బాక్సాఫీస్ విశ్లేషకుల ప్రకారం, హిందీ వెర్షన్ వసూళ్లు రూ.800 కోట్ల దాకా వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే, మరికొందరు నిపుణులు ఆ మొత్తం కాస్త అధికంగా అంచనా వేశారని, అసలు వసూళ్లు రూ. 700 కోట్ల లోపే ఉండొచ్చని అబిప్రాయపడుతున్నారు. ఏది నిజమైనా, హిందీ మార్కెట్లో అంత స్థాయిలో వసూళ్లు సాధించిన ఏకైక సినిమా "పుష్ప 2" అన్నది మాత్రం ఖచ్చితమే.

"ఛావా" సినిమా "పుష్ప 2" రికార్డును బ్రేక్ చేస్తుందనే ఆశలు బలంగా ఉన్నా, అది సాధ్యం కాలేదు. అయితే, "పుష్ప 2" వసూళ్లపై వివాదం కూడా ఉంది. కొంతమంది విమర్శకులు సినిమా వసూళ్లను ఫేక్‌గా పెంచినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ, సినిమా హిందీ మార్కెట్‌లో దుమ్ము దులిపిందనేది మాత్రం అవాస్తవం కాదు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, దేశీయ మార్కెట్లో అత్యధికంగా వసూలు చేసిన హిందీ సినిమా "పుష్ప 2" నే అవుతుంది.

Tags

Next Story