ఆగష్టు 14 న పూజా అండ్ కియారా గ్లామర్ వార్!

ఆగష్టు 14 న పూజా అండ్ కియారా గ్లామర్ వార్!
X
పూజా హెగ్డే, కియారా అద్వానీ, యువతలో విపరీతమైన ఫాలోయింగ్‌తో అదరగొడుతున్నారు. ఆగస్టు 14న ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీస్ మధ్య ఓ సూపర్ గ్లామర్ షోడౌన్ జరగబోతోంది.

భారతీయ తెరపై గ్లామర్ క్వీన్స్‌గా వెలుగొందుతున్న పూజా హెగ్డే, కియారా అద్వానీ, యువతలో విపరీతమైన ఫాలోయింగ్‌తో అదరగొడుతున్నారు. వీరిద్దరి ఆకర్షణ అభిమానులను ఫిదా చేస్తోంది. ఆగస్టు 14న ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీస్ మధ్య ఓ సూపర్ గ్లామర్ షోడౌన్ జరగబోతోంది.

పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ‘కూలీ’, కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ‘వార్ 2’ సినిమాలు ఒకే రోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇటీవల విడుదలైన ఈ రెండు సినిమాల ప్రమోషనల్ కంటెంట్‌లో వీరిద్దరి గ్లామర్ హై రేంజ్‌లో కనిపిస్తోంది. ‘కూలీ’ సినిమా నుంచి నిన్న విడుదలైన పూజా హెగ్డే ఫీచర్ అయిన మోనికా సాంగ్ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.

మరోవైపు, వార్ 2లో కియారా అద్వానీ గ్లామర్ అప్పీల్ మామూలుగా లేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌లో కియారా బ్యాక్ షాట్ ఒక్కటే సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఈ ఇద్దరి గ్లామర్ ఫేస్-ఆఫ్ ఇటీవలి కాలంలో జరిగే అత్యంత ఆసక్తికరమైన గ్లామర్ క్లాష్‌గా నిలవనుంది.

ఆగస్టు 14న ప్రేక్షకులు, ముఖ్యంగా గ్లామర్ లవర్స్‌కి ఈ ఇద్దరు బ్యూటీస్ పూజా, కియారాల ఎక్స్‌ప్లోసివ్ గ్లామర్ డిస్‌ప్లేతో థియేటర్లలో ఓ విజువల్ ఫీస్ట్ ఖాయం.

Tags

Next Story