సూపర్ కాంబో మూవీ అనౌన్స్ చేసిన ప్రియదర్శన్

సూపర్ కాంబో మూవీ అనౌన్స్ చేసిన ప్రియదర్శన్
X
ప్రియదర్శన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్ కుమార్ మరియు సైఫ్ అలీ ఖాన్‌లతో లార్డ్స్‌లో తీసిన ఫోటోను షేర్ చేస్తూ, "'హైవాన్' నా తదుపరి సినిమా, అక్షయ్ కుమార్ మరియు సైఫ్ అలీ ఖాన్‌తో " అని రాశారు.

బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్, మాలీవుడ్ సూపర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ లోని ‘హేరా ఫేరి 3’ మూవీ కంటే ముందు మరో ప్రాజెక్ట్‌లో పని చేయ నున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని, దీని టైటిల్ 'హైవాన్' అని గుసగుసలు సాగాయి. ఇప్పుడు దర్శకుడు ప్రియదర్శన్ స్వయంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి... టైటిల్‌తో పాటు ప్రధాన తారాగణాన్ని కూడా నిర్ధారించారు. ప్రియదర్శన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్ కుమార్ మరియు సైఫ్ అలీ ఖాన్‌లతో లార్డ్స్‌లో తీసిన ఫోటోను షేర్ చేస్తూ, "'హైవాన్' నా తదుపరి సినిమా, అక్షయ్ కుమార్ మరియు సైఫ్ అలీ ఖాన్‌తో " అని రాశారు.

ఈ పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లతో సందడి చేశారు. షేర్ చేసిన ఫోటోలో 'మైన్ ఖిలాడీ తు అనారీ' జోడీ కలిసి మాట్లాడుకుంటూ.. మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అక్షయ్ కుమార్ బీజ్ కలర్ బ్లేజర్, వైట్ షర్ట్, గాగుల్స్‌తో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ బ్లూ షర్ట్, స్ప్రింగ్ ఏవియేటర్స్‌తో తన చార్మింగ్ లుక్‌ను ప్రదర్శించారు. అక్షయ్ కుమార్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన నటులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్‌గా చెబుతున్నారు.

ఇది ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'ఒప్పం' రీమేక్ అని తెలుస్తోంది. ఒరిజినల్ సినిమాలో మోహన్‌లాల్ హీరోగా నటించగా.. అది ఆయన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, 'హైవాన్' షూటింగ్ 2025 ఆగస్టులో మొదలై.. 2026లో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో, సైఫ్ అలీ ఖాన్ గుడ్డి వ్యక్తిగా కనిపించనున్నారని సమాచారం.

మిగతా తారాగణం ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అక్షయ్ కుమార్‌కు ముందు, ప్రియదర్శన్ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్‌ను ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 'హైవాన్' పూర్తయిన తర్వాత.. ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామెడీ సీక్వెల్ 'హేరా ఫేరి 3'కు షిఫ్ట్ అవుతారు.


Tags

Next Story