పృధ్విరాజ్ సుకుమారన్, కరీనా బాలీవుడ్ చిత్రం !

“తల్వార్”, “రాజీ” వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకురాలు మెఘనా గుల్జార్. తాజాగా ఆమె తన తదుపరి చిత్రం ప్రకటించింది. జంగ్లీ పిక్చర్స్‌తో ఇది ఆమె మూడవ సంయుక్త ప్రాజెక్ట్ కావడం విశేషం. “దాయ్రా” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక తీవ్రతతో కూడిన క్రైమ్-డ్రామా.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సమాజంలోని ప్రస్తుత చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా ఈ కథ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. నేరం, శిక్ష, న్యాయం అనే శాశ్వత అంశాలను ఆధారంగా చేసుకుని ఒక తీవ్రమైన కథనం రూపంలో ఈ చిత్రం రూపొందనుంది.
ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2023లో ‘సామ్ బహదూర్’ తర్వాత మెఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం ఇది. నేరం, శిక్ష, న్యాయం, సత్యం వంటి అంశాలను లోతుగా ఆవిష్కరించేలా ఈ కథ సాగనుంది. ‘దాయ్రా’ ఒక శక్తివంతమైన, భావోద్వేగాలతో నిండిన.. సారాంశంతో కూడిన సినిమాగా రూపొందనుంది.
-
Home
-
Menu