రిషికేష్ లో పూజా హెగ్డే కొత్త సినిమా ప్రారంభం !

పూజా హెగ్డే కెరీర్ మళ్లీ ఊపందుకుంది. బాలీవుడ్, తమిళ పరిశ్రమల్లో వరుసగా మంచి ప్రాజెక్టులు అందుకుంటూ.. తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. తమిళంలో సూర్య ప్రధాన పాత్రలో ఆమె నటించిన ‘రెట్రో’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ‘జన నాయకన్’ చిత్రీకరణ దశలో ఉంది.
తాజాగా.. పూజా హెగ్డే బాలీవుడ్‌లో కొత్త సినిమా ప్రారంభించింది. పూజా హెగ్డే, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీకి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే టైటిల్ పెట్టారు. చిత్రీకరణ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజా తన సోషల్ మీడియా ఖాతాలో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకుంది. “రిషికేష్‌లో మా షెడ్యూల్‌కు అద్భుతమైన ప్రారంభం. ఆశీస్సులు అందు కున్నాను.” అని పూజా తెలిపింది.
ఒకప్పుడు తెలుగులో ఐదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే .. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ వంటి సినిమాల పరాజయంతో కొన్ని అనుకున్న అవకాశాలు కోల్పోయింది. అయితే, ఆమె తమిళ, హిందీ పరిశ్రమలపై దృష్టిపెట్టడంతో మంచి ప్రాజెక్టులు లభించాయి. ప్రస్తుతం ఈ రెండు పరిశ్రమల్లోనూ ఆమెకు వరుస అవకాశాలు వస్తుండటం ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే సంకేతాలను ఇస్తోంది.
-
Home
-
Menu