‘హేరా ఫేరీ 3’ లోకి తిరిగి పరేష్ రావల్ !

‘హేరా ఫేరీ 3’ లోకి తిరిగి పరేష్ రావల్ !
X
“ఎంతో మంది ఆదరించిన ప్రాజెక్ట్ అయినప్పుడు, దాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు అంతా సమసిపోయింది...’’ అని పరేష్ రావల్ అన్నారు.

బాలీవుడ్ క్రేజీ కామెడీ ఫ్రాంచైజీ చిత్రం ‘హేరా ఫేరీ 3’. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. అయితే, ఒక రోజు షూటింగ్ తర్వాత, పరేష్ రావల్ సరైన కారణం చెప్పకుండా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. చిత్ర నిర్మాత కూడా అయిన అక్షయ్ కుమార్, పరేష్ రావల్ వృత్తిపరమైన వైఖరిని తప్పుబట్టి.. 25 కోట్ల రూపాయల నష్టపరిహారం కోసం కేసు వేశారు.

ఈ వివాదం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. పరేష్ రావల్ పోషించిన బాబూ భయ్యా పాత్రకు ఎవరూ సాటిరారని అభిమానులు భావించారు. ఈ పరిణామంతో ఫ్రాంచైజీ అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం, పరేష్ రావల్ హేరా ఫేరీ 3కి తిరిగి వస్తున్నారు. ది హిమాన్షు మెహతా షో పోడ్‌కాస్ట్‌లో ఈ వివాదంపై స్పందిస్తూ.. “ఎంతో మంది ఆదరించిన ప్రాజెక్ట్ అయినప్పుడు, దాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు అంతా సమసిపోయింది...’’ అని పరేష్ రావల్ అన్నారు.

‘హేరా ఫేరీ 3’ ప్రాజెక్ట్ ప్రణాళిక పకారం సాగుతుందా అని అడిగినప్పుడు.. “ఇది ఎప్పుడూ జరగాల్సిందే. కానీ, కొన్నిసార్లు అందరూ సృజనాత్మక వ్యక్తులు కాబట్టి, విషయాలను కొంచెం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ప్రియదర్శన్, అక్షయ్, సునీల్ శెట్టి నాకు ఎప్పటికీ స్నేహితులే...” అని పరేశ్ రావల్ అన్నారు. మరి ‘హేరా ఫేరీ 3’ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags

Next Story