‘వార్ 2’ లో యన్టీఆర్ పాత్ర ఇదేనా?

‘వార్ 2’  లో యన్టీఆర్ పాత్ర ఇదేనా?
X
సీక్వెల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న యన్టీఆర్ పాత్ర పేరు వీరేంద్ర రఘునాథ్ అని సమాచారం.

యంగ్ టైగర్ యన్టీఆర్ బాలీవుడ్‌లో తొలిసారిగా అడుగు పెడుతున్న క్రేజీ మూవీ "వార్ 2". హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం "వార్" కు ఇది కొనసాగింపు. ఇందులో హృతిక్ రోషన్ మరోసారి కబీర్ అనే ‘రా’ ఏజెంట్ పాత్రలో అదరగొట్టబోతున్నాడు. ఇక సీక్వెల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న యన్టీఆర్ పాత్ర పేరు వీరేంద్ర రఘునాథ్ అని సమాచారం.

వీరేంద్ర రఘునాథ్ ఒక దక్షిణ భారతీయుడు. ఒకప్పుడు ‘రా’ ఏజెంట్‌గా ఉన్న అతను.. తనకు స్వంత సహచరుల చేతిలో మోసం జరిగిందని భావించి.. కబీర్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కథాంశం హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్ మధ్య వాడి వేడిగా సాగే మేజర్ కాన్ఫ్లిక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి పెర్ఫార్మెన్స్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమా లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో.. ఈ సినిమాలోని హృతిక్ అండ్ యన్టీఆర్ పాల్గొన్న ఒక భారీ ఫైట్ సీన్ వీడియో లీక్ అయింది. అయితే.. యష్ రాజ్ ఫిలిమ్స్ టీం వెంటనే దానిని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యధికంగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇంక ఇందులో యన్టీఆర్, హృతిక్ ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని కలిగించనున్నాయని చిత్రబృందం వెల్లడించింది.

Tags

Next Story