ఐకానిక్ సాంగ్ షూట్ మొదలైంది !

ఐకానిక్ సాంగ్ షూట్ మొదలైంది !
X
ఈ క్రేజీ డాన్స్ ట్రాక్ షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఊహించినట్టుగానే, ఈ సాంగ్‌ను ఇండస్ట్రీలోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు కంపోజ్ చేశారు. ఇది ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది.

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ యన్టీఆర్ మొదటి సారి స్క్రీన్‌పై కలిసి కనిపించనున్న సూపర్ కాంబో మూవీ ‘వార్ 2’. ఈ మూవీ ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోల డైనమిక్ స్టార్ పవర్, అదిరిపోయే డాన్స్ స్కిల్స్ కలగలిసి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌ మెంట్‌గా మార్చబోతున్నాయి. ఆ స్కార్ అవార్డు గెలుచుకున్న "నాటు నాటు" పాటలో రామ్ చరణ్‌తో కలిసి గ్లోబల్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు హృతిక్ రోషన్‌తో డాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

హృతిక్ రోషన్... ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ డాన్సర్లలో ఒకడు అన్న సంగతి తెలిసిందే. అతని సిగ్నేచర్ మూవ్స్‌తో ఎప్పుడూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఈ ఇద్దరి సూపర్ ఎనర్జీని క్యాష్ చేసుకోవడానికి "వార్ 2" టీమ్ ఒక స్పెషల్ డాన్స్ నంబర్‌ను ప్లాన్ చేసింది, ఇందులో హృతిక్, ఎన్టీఆర్‌లు తమ అద్భుతమైన డాన్స్ మూవ్‌లతో స్టేజ్‌ను ఫైర్ చేయనున్నారు. ఈ సాంగ్‌లో వీళ్లిద్దరూ కలిసి దుమ్మురేపబోతున్నారని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు.

ఈ క్రేజీ డాన్స్ ట్రాక్ షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఊహించినట్టుగానే, ఈ సాంగ్‌ను ఇండస్ట్రీలోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు కంపోజ్ చేశారు. ఇది ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది. ఈ సాంగ్ విజువల్స్, బీట్స్, కొరియోగ్రఫీ అన్నీ కలిసి థియేటర్స్‌ ను ఊపేసేలా ఉండబోతున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న "వార్ 2", వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో లేటెస్ట్ అడిషన్. ఈ సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ కానుంది. హృతిక్-ఎన్టీఆర్ కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, డాన్స్ నంబర్స్‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా.

Tags

Next Story