‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?

‘ముఫాసా: ది లయన్ కింగ్’  డిజిటల్ రిలీజ్  ఎప్పుడంటే?
X
ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ పై ప్రీమియర్‌ మార్చి లేదా ఏప్రిల్ 2025లో ప్రసారం అవుతుందని అంచనా.

డిసెంబర్ 20, 2024న థియేటర్లలో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా.. విశేష ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 470 మిలియన్ అమెరికా డాలర్లకు పైగా వసూలు చేసి.. 2024లో తొమ్మిదవ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ పై ప్రీమియర్‌ మార్చి లేదా ఏప్రిల్ 2025లో ప్రసారం అవుతుందని అంచనా.

నిర్మాతలు సాధారణంగా 100 రోజుల పాటు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనిని బట్టి ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిజిటల్ విడుదల తేదీ మార్చి లేదా ఏప్రిల్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్లో ప్రత్యేకంగా స్ట్రీమ్‌ కానుంది. డిస్నీ తరచుగా బుధవారాలు డిజిటల్ విడుదలల కోసం ఎంచుకుంటోంది. ఉదాహరణకు.. ‘ది లిటిల్ మెర్మెయిడ్’ 103 రోజుల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సాధారణంగా డిస్నీ చిత్రాలు థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి.

‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీ 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ క్లాసిక్‌కు కొనసాగింపుగా తెరకెక్కింది. అకాడమీ అవార్డు గ్రహీత జెంకిన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక హిందీ వెర్షన్‌లో ముఫాసాకు షారుక్ ఖాన్ జీవం పోశారు. తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ బాబు స్వరాన్ని అందించారు. ఈ చిత్రం థియేటర్లలో ‘సానిక్ ది హెజ్‌హాగ్’ వంటి సినిమాలతో పోటీ ఎదుర్కొంది.

Tags

Next Story