నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను : మృణాళ్ ఠాకూర్

నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను : మృణాళ్ ఠాకూర్
X
ఆ వీడియో తన టీనేజ్ రోజుల్లోనిదని, అప్పట్లో చాలా సిల్లీగా, అపరిపక్వ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ముప్పై ఏళ్ల వయసులో ఉన్న మృణాళ్... "అందం అన్ని రూపాల్లో ఉంటుంది" అని గ్రహించి, తన గత వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలిపారు.

క్రేజీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ గతంలో బిపాషా బసు రూపం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాత వీడియో ఇటీవల వైరల్ అయింది. దీనిపై విస్తృత విమర్శలు వచ్చాయి. మృణాళ్ ఇప్పుడు జాగ్రత్తగా తన పబ్లిక్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్నప్పటికీ, గతంలో ఇతర నటీమణుల గురించి తక్కువగా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఆమెపై విమర్శలకు దారి తీశాయి. ఈ వీడియో తిరిగి వెలుగులోకి రావడంతో... బిపాషా బసు పరోక్షంగా స్పందిస్తూ, ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వివాదం తీవ్రమై, తన ఇమేజ్‌కు మచ్చ తెచ్చే స్థితికి చేరడంతో... మృణాళ్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టతనిచ్చారు. ఆ వీడియో తన టీనేజ్ రోజుల్లోనిదని, అప్పట్లో చాలా సిల్లీగా, అపరిపక్వ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ముప్పై ఏళ్ల వయసులో ఉన్న మృణాళ్... "అందం అన్ని రూపాల్లో ఉంటుంది" అని గ్రహించి, తన గత వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలిపారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘‘19 ఏళ్ల వయసులో నేను టీనేజర్‌గా చాలా సిల్లీ విషయాలు మాట్లాడాను. నేను అప్పట్లో సరదాగా చెప్పిన మాటలు ఎంత బాధ కలిగిస్తాయో అప్పట్లో అర్థం కాలేదు. కానీ అవి బాధ కలిగించాయి. దానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను’’.. అని తెలిపింది.

‘‘ఎవరినీ శారీరకంగా విమర్శించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఓ ఇంటర్వ్యూలో సరదాగా చేసిన సంభాషణ అతిగా జరిగింది. కానీ అది ఎలా అనిపించిందో నాకు అర్థమైంది, నేను మాటలను మరో విధంగా ఎంచుకుని ఉండాలని అనుకుంటున్నాను. కాలం గడిచే కొద్దీ, అందం అన్ని రూపాల్లో ఉంటుందని నేను గ్రహించాను. అని క్లారిటీ ఇచ్చింది.

Tags

Next Story