సినిమా, సిరీస్ ఒకేసారి షూటింగ్ !

పాపులర్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు ఇండియాలోనే ఓటీటీ సిరీస్‌ను సినిమా రూపంలో విస్తరించడంలో మొదటి ప్రాజెక్టుగా నిలిచింది. 2024 అక్టోబర్‌లో మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించగా.. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాతో పాటు నాలుగో సీజన్‌ను కూడా 2025 సెప్టెంబర్ నుంచి ఒకేసారి షూట్ చేయనున్నారు. సినిమా, సిరీస్ లాంటి రెండు వేర్వేరు ఫార్మాట్లను ఒకేసారి షూట్ చేయడం పెద్ద సవాలుగా భావించినా.. దీని వల్ల కథానుసరణకి తోడ్పడడంతో పాటు నటుల సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రధాన నటులు పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మతో పాటు దివ్యేందు, అభిషేక్ బెనర్జీ, రసికా దుగాల్, విజయ్ వర్మ వంటి ఇతర నటుల నుండి బల్క్ డేట్స్ తీసుకోవడం పూర్తయింది. ఇందులో ప్రతి ఒక్కరి డేట్స్‌ను మరలా తిరిగి తీసుకోవడం కష్టంగా ఉంటుందని భావించిన మేకర్స్ ఒకేసారి సినిమా, సిరీస్ షూట్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల రెండు ఫార్మాట్ల కథలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా ప్లాన్ చేయవచ్చు అని మేకర్స్ భావిస్తున్నారు.
షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమవుతుందని, కొంత భాగం ముంబైలో కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. రెండు వేర్వేరు ఫార్మాట్లను ఒకేసారి తెరకెక్కించడం తారాగణం, సాంకేతిక బృందానికి కొత్త సవాలుగా నిలవనుంది. పునీత్ కృష్ణ ఈ సిరీస్ సృష్టికర్తగా కొనసాగుతుండగా.. గుర్మీత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. “సిరీస్‌కు ఉన్న అదే రా ఎనర్జీని సినిమాకి కూడా అందించనున్నారు, అయితే సినిమా మరింత పెద్ద స్కేల్‌పై తెరకెక్కుతుంది” అని సమాచారం.
-
Home
-
Menu