బాలీవుడ్ లోకి మీనాక్షి చౌదరి?

బాలీవుడ్ లోకి మీనాక్షి చౌదరి?
X
మీనాక్షి త్వరలో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ బోతోందని. బాలీవుడ్ బడా నిర్మాత దినేష్ విజన్ నిర్మించబోయే ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని టాక్.

టాలీవుడ్ అందాల హీరోయిన్ .. మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం ప్రారంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అందుకొని సత్తా చాటింది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు ఆమె బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్‌లతో సూపర్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

లేటెస్ట్ బజ్ ఏంటంటే, మీనాక్షి త్వరలో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ బోతోందని. బాలీవుడ్ బడా నిర్మాత దినేష్ విజన్ నిర్మించబోయే ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని టాక్. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది, అదీ మీనాక్షి టాలెంట్‌కి తగ్గట్టుగా స్పెషల్‌గా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అంతేకాదు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కి మ్యాచ్ అయ్యే లీడ్ యాక్టర్ కోసం కూడా టీమ్ ఫుల్ సెర్చ్‌లో ఉంది.

ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఫ్యాన్స్ ఇప్పటినుంచే హైప్‌లో ఉన్నారు. అటు బాలీవుడ్ డెబ్యూ గురించి సస్పెన్స్ కంటిన్యూ అవుతున్నా, ఇటు తెలుగులో మీనాక్షి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రెడీ అవుతోంది. ఆమె నెక్స్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’,. ఇందులో ఆమె యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్‌లో మరో బిగ్ బ్రేక్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.

Tags

Next Story