బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మీనాక్షి

అందాల హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు సౌత్ సినిమాల్లో.. ముఖ్యంగా పలు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. 'లక్కీ భాస్కర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో బిజీగా మారింది. మరో వైపు ఆమె హిందీ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు ఒక క్రేజీ ఆఫర్ లభించింది.
బాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న ఊహాగానాల ప్రకారం, మీనాక్షి చౌదరిని జాన్ అబ్రహం సరసన కథానాయికగా తీసుకున్నారు. జాన్ అబ్రహం త్వరలోనే 'ఫోర్స్ 3' షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భవ ధూళియా ఈ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నాడు.
ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఈ ఇద్దరూ ఖరారు చేశారు. లుక్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే మీనాక్షి చౌదరిని ఈ పాత్రకు ఫైనల్ చేశారు. షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఆమెకు శిక్షణ ఇస్తారు. 'ఫోర్స్ 3' మూవీ నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది విడుదల కానుంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' చిత్రంలో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
-
Home
-
Menu