అర్జున్ కపూర్ తర్వాత ఇతడేనా?

బాలీవుడ్‌లో ఒకప్పటి హాట్ ఐటెం గర్ల్‌గా, ప్రముఖ నటి మలైకా అరోరా ఎంతో మంది అభిమానులకు చిరపరిచితమైన పేరు. ఆమె ఎన్నో చార్ట్ బస్టర్ పాటల్లో కనిపించింది. తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తరువాత.. మలైకా యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అయితే, కొన్నేళ్ల రిలేషన్ తర్వాత మలైకా, అర్జున్ కపూర్ విడిపోయారు. ఆ తర్వాత మలైకా అరోరా ఒంటరి అయిపోయింది.
ఇటీవల మలైకా అరోరా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరతో కలిసి కనిపించడం సంచలనంగా మారింది. ఐపీయల్ లో రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సమయంలో, ఇద్దరూ ఒకే చోట కూర్చొని మ్యాచ్‌ను వీక్షించడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కుమార సంగక్కర డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఘటన తర్వాత మలైకా అరోరా, కుమార సంగక్కర డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టు గులాబీ రంగు జెర్సీలో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. వీరిద్దరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు మలైకా అరోరా, కుమార సంగక్కర ఇద్దరూ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఈ వార్తలు నిజమేనా? లేక ఇవి కేవలం అభిమానుల ఊహాగానాలా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవ్వాల్సి ఉంది.
-
Home
-
Menu