‘మహాభారతం’ స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం!

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ తనకు ‘మహాభారతం’ సినిమా తీయాలనే కల ఉందని ఎన్నోసార్లు పేర్కొన్నారు. తాజాగా.. ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్ ఖాన్.. "మేము ఇప్పుడే రచనా ప్రక్రియను ప్రారంభించాం. ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం... ఇంకా చాలా విషయాలు రూపొందించుకోవాలి. చూడాలి మరి, ఇది ఎలా సాగుతుందో.." అని అన్నారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్.. "మహాభారతం మీద సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక యాగం చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, మరెన్నో అర్థాలు దాగున్నాయి. అందుకే ఇంకా దీనికి సిద్ధంగా లేను. మహాభారతం ఎప్పుడూ నిరాశ పరచదు, కానీ మనమే దాన్ని నిరాశపర్చకుండా చూసుకోవాలి," అని చెప్పారు.
అంతేకాకుండా, "అందాజ్ అప్నా అప్నా" సీక్వెల్‌పై కూడా ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి, నటుడు సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమా సీక్వెల్ పై చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఆమిర్ ఖాన్ మార్చి 14న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. గతంలో "లాల్ సింగ్ చద్దా" అనే హాలీవుడ్ సినిమా "ఫారెస్ట్ గంప్" రీమేక్‌లో నటించిన ఆయన, ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు మహాభారతం ప్రాజెక్ట్‌తో మరోసారి భారీ కదలికకు సిద్ధమవుతున్నారా? అన్నది చూడాలి.
-
Home
-
Menu