కియారా అద్వానీ ప్లేస్ ను రీప్లేస్ చేసిందా?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత.. తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఆమె తన భర్త, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తమ మొదటి సంతానాన్ని ఆశిస్తోంది. వైద్యులు ఆమె గర్భాన్ని ధృవీకరించిన వెంటనే, కియారా తన వృత్తిపరంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె సంతకం చేసిన సినిమా ప్రాజెక్టుల నుండి తాత్కాలికంగా తప్పుకుంది.
కియారా.. కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన “టాక్సిక్” సినిమాలో తన భాగం షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసింది. అయితే, ఇంకా షూటింగ్ ప్రారంభం కాని సినిమాల నుండి ఆమె వైదొలగడం గమనార్హం. అలాంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న “డాన్ 3”. ఈ సినిమాలో కియారా, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ సరసన ప్రధాన హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. “డాన్” సిరీస్‌లో భాగమైన ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన నేపథ్యంలో, కియారా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కియారా అద్వానీ ఈ సినిమా నుండి వైదొలగడంతో, ఆమె స్థానంలో కృతి సనన్‌ను తీసుకునే అవకాశం ఉందని తాజా సమాచారం. కృతి సనన్.. ఈ అవకాశాన్ని ఆలోచించకుండా స్వీకరించినట్లు తెలుస్తోంది. “డాన్ 3” వంటి భారీ చిత్రంలో నటించడం కృతి కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు, కాబట్టి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటింది. ఆమె మహేష్ బాబుతో “1 నేనొక్కడినే” మరియు ప్రభాస్‌తో “ఆదిపురుష్” వంటి భారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
-
Home
-
Menu