‘క్రిష్ 4’ సినిమా మరింత ఆలస్యం ?

‘క్రిష్ 4’ సినిమా మరింత ఆలస్యం ?
X
తాజా సమాచారం ప్రకారం ‘క్రిష్ 4’ ను 2026 కి మళ్లీ వాయిదా వేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం.

హృతిక్ రోషన్, రాకేశ్ రోషన్‌ కాంబో మూవీ ‘క్రిష్ 4’ బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ సూపర్‌హీరో ఫ్రాంచైజీలో నాలుగో భాగం అనేక సార్లు వాయిదా పడింది. 2025 రెండో భాగంలో చిత్రీకరణ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ‘క్రిష్ 4’ ను 2026 కి మళ్లీ వాయిదా వేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం.

బాలీవుడ్ సమాచారం ప్రకారం, ‘క్రిష్ 4’ ఆలస్యానికి ముఖ్య కారణం బడ్జెట్ సమస్యలేనట. హృతిక్ రోషన్, ఈ ప్రాజెక్ట్‌కి స్టూడియోను సంప్రదించేందుకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ ఆనంద్‌కు బాధ్యత అప్పగించారట. అయితే, భారతదేశంలోని ప్రధాన సినీ స్టూడియోలు ‘క్రిష్ 4’ కు భారీ బడ్జెట్ పెట్టడంపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మార్వెల్ సినిమాల ప్రభావం పెరిగిన ఈ కాలంలో, దశాబ్ద కాలంగా క్రిష్ సిరీస్‌కు విరామం ఉండటంతో స్టూడియోలు భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధంగా లేవు.. అని ఓ సన్నిహిత వర్గం వెల్లడించింది.

అయితే సిద్ధార్థ్ ఆనంద్ , అతని నిర్మాణ సంస్థ మార్‌ఫ్లిక్స్ ఈ చిత్రంతో ఇక సంబంధం లేకుండా వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే, బడ్జెట్‌పై పత్రికల్లో వస్తున్న "అత్యధిక అంచనాలు తప్పుడు సమాచారం మాత్రమే" అని మరో వర్గం ఖండించింది. తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్, రాకేశ్ రోషన్ కలిసి భారతదేశంలోని ప్రముఖ స్టూడియోలతో నేరుగా చర్చలు జరిపే ప్రయత్నంలో ఉన్నారు. ఫిల్మ్‌క్రాఫ్ట్ బ్యానర్‌ ద్వారా ‘క్రిష్ 4’ నిర్మాణం జరపనున్నారు. మరోవైపు, మార్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని ఇతర సినిమాలపై దృష్టి పెట్టనుంది. త్వరలోనే కొత్త టీమ్‌ను ఎంపిక చేసి, బడ్జెట్‌ను మళ్లీ సమీక్షించనున్నారు. ఇది పూర్తయిన వెంటనే, క్రిష్ 4 సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.

రాకేశ్ రోషన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ ఏడాది చివరికి ‘క్రిష్ 4’ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సూపర్‌హీరో ఫ్రాంచైజీ కొత్త మార్గంలో ఎప్పుడు ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

Tags

Next Story