రణబీర్ కపూర్ - కొరటాల కాంబో.. ఇది నిజమేనా?

సీనియర్ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ.. ఎన్టీఆర్‌కు ‘దేవర’ లాంటి డీసెంట్ హిట్ అందించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించి, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఎపిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఓ ఫేస్-సేవింగ్ సినిమా అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పుడు, కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో సినిమా చేయాలని యోచిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం... ఈ ఇద్దరి మధ్య చర్చలు ముందుకెళుతున్నాయని, ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ పట్ల సింక్‌లో ఉన్నారని అంటున్నారు. అయితే... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లాజికల్ ఛాలెంజ్‌లు ఉన్నాయి. అవి పరిష్క రించకపోతే.. ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మొదటగా... కొరటాల శివ పూర్తిగా తెలుగులోనే సినిమాలు చేసిన డైరెక్టర్. ‘దేవర’ కూడా తెలుగు రూటెడ్ సినిమా గానే మిగిలిపోయింది. అర్జున్ రెడ్డి లాంటి గేమ్‌చేంజింగ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులకు బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తారు.
కానీ.. కొరటాల శివ ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటివరకు బాలీవుడ్‌లో తన ప్రతిభను ప్రదర్శించలేదనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి.. రణబీర్ కపూర్ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాలంటే.. తప్పకుండా కొరటాల శివ అందించిన కథ అద్భుతంగా, ఊహించని మలుపులతో ఉండాలి. ఈ వార్తల్లో నిజమెంతో త్వరలోనే తేలనుంది. అప్పటి వరకు ఈ స్పెక్యులేషన్స్‌పై ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే!
-
Home
-
Menu