అక్క కన్నా చెల్లెలు చాలా ఫాస్ట్ !

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండియన్ స్ర్కీన్ పై టాప్ హీరోయిన్ గా మంచి స్థానం ఏర్పరచుకుంది. రీసెంట్ గా .. ఎన్టీఆర్ సరసన కథానాయికగా "దేవర" చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్‌తో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దీనికి దర్శకుడు.
ఇదిలా ఉంటే.. జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా తన సొంత స్థానం కోసం ప్రయత్నిస్తోంది. ఇంకా మొదటి సక్సెస్ అందుకోకుండానే.. వరుస ప్రాజెక్టులు చేయడం గమనార్హం. ఖుషీ 2023లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం "ది ఆర్చీస్" ద్వారా అరంగేట్రం చేసింది. ఇటీవల ఆమె రెండో సినిమా "లవ్యాపా" పూర్తయింది. ఇది ఖుషీ కపూర్‌కి తొలి థియేట్రికల్ రిలీజ్ కానుండటం విశేషం. ఈ చిత్రంలో ఆమె.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో జోడీగా నటించింది. "లవ్యాపా" ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఖుషీ మరో అవకాశాన్ని అంది పుచ్చుకుంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహిం అలీ ఖాన్ హీరోగా చేస్తున్న "నాదానియాన్" చిత్రంలో ఖుషీ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ అధికారికంగా ప్రకటించారు. ఇలా చాలా తక్కువ సమయంలో ఖుషీ మూడు సినిమాలు చేసేయడం విశేషం. అయితే.. తన అక్క జాన్వీ మార్గంలోనే ఆమె కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందా? అనేది చూడాలి.
-
Home
-
Menu