సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘కేసరి 2’

బ్రిటిష్ కాలంలో జరిగిన జాలియన్‌వాలాబాగ్ హత్యాకాండ తరువాత జరిగిన చారిత్రాత్మక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి: చాప్టర్ 2’ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రానికి ఏ విధమైన కట్స్ లేకుండా సర్టిఫికెట్ జారీ చేయడం విశేషం. సినిమాలో కొన్ని జంతు సంబంధిత దృశ్యాల నేపథ్యంలో, జంతు సంక్షేమ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ సమర్పించాలని సెన్సార్ బోర్డ్ దర్శకుడిని ఆదేశించింది.
‘కేసరి 2’ కథ జాలియన్‌వాలాబాగ్ హత్యాకాండ అనంతరం సాగుతుంది. అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) బ్రిటిష్ అధికారులపై న్యాయపోరాటానికి దిగిన తీరును ఈ చిత్రం చూపిస్తుంది. హత్యాకాండపై విచారణ మొదలైనపుడు, నాయర్ జనరల్ డైయర్‌ను నేరుగా ప్రశ్నిస్తాడు. ఆర్ మాధవన్, ఓ ధీటైన బ్రిటిష్ న్యాయవాది నెవిల్ మెక్‌కిన్లీగా నాయర్‌కు వ్యతిరేకంగా నిలుస్తాడు. ఈ న్యాయపోరాటం మధ్యలో అనన్య పాండే, లాయర్ దిల్రీట్ గిల్గా ఒక ధైర్యమైన మహిళా న్యాయవాదిని పోషించింది. పురుషాధిక్య న్యాయ రంగంలో ఆమె డంకా మోగిస్తుంది.
సెన్సార్ నుంచి క్లియర్ అయిన ‘కేసరి: చాప్టర్ 2’ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. చారిత్రాత్మక నేపథ్యంతో సాగుతున్న ఈ సినిమా, నిజానికి కోర్ట్ రూంలో జరిగిన ఓ చారిత్రాత్మక యుద్ధం కావడం విశేషం. ప్రేక్షకులను ఆలోచింపజేసే, దేశ భక్తిని రెచ్చగొట్టే చిత్రంగా నిలవనుందని అంచనాలు.
-
Home
-
Menu