బాలీవుడ్ లో కీర్తి సురేశ్ రోమ్ కామ్ ?

బాలీవుడ్ లో కీర్తి సురేశ్ రోమ్ కామ్ ?
X
తాజా సమాచారం ప్రకారం, కీర్తి ప్రస్తుతం ఓ హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతోంది.

మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లో అట్లీ దర్శకత్వం వహించిన "బేబీ జాన్" చిత్రంతో తన అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, తన స్థానాన్ని ముమ్మరంగా స్థిరపరచుకోవడానికి కీర్తి ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కీర్తి ప్రస్తుతం ఓ హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతోంది.

ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, వర్సటాలిటీ మేకర్స్‌ను ఆకట్టుకున్నాయి. అంతేగాక, ఈ చిత్రంలో ఆమె సరికొత్త యాంగిల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కీర్తి పాత్ర కాస్త సరదాగా, ఉల్లాసంగా, వినోదాత్మకంగా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీలకు మంచి మార్కెట్ ఉంది. ఇదే విధంగా.. కీర్తి కూడా ఇలాంటి సినిమాల్లో మెప్పించిన అనుభవం కలిగిన నటి. ‘నేను శైలజ, నేను లోకల్, తానా సేర్న్ ద్ కూట్టం, రంగ్ దే’ వంటి హిట్ రొమాంటిక్ కామెడీల్లో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇప్పటికైతే... ఈ కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, కథా వివరాలు, ఇతర నటీనటుల సమాచారం గోప్యంగా ఉంచారు. కానీ, ఈ రొమాంటిక్ కామెడీ సినిమా కీర్తికి బాలీవుడ్‌లో మరింత గుర్తింపు తీసుకురావడం ఖాయం. ఇక, కీర్తి మరో క్రేజీ ప్రాజెక్ట్ "అక్క" లోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు రాధికా ఆప్టే, తన్వీ అజ్మీ, దిప్తి సాల్వి కీలక పాత్రలు పోషిస్తున్నారు. "అక్క" అనేది ఓ రివెంజ్ థ్రిల్లర్. ఇది "పెర్నూరు" అనే కల్పిత ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది. ఈ చిత్రంలో మహిళా గ్యాంగ్ లీడర్‌గా కీర్తి శరవేగంగా దూసుకుపోనుంది కీర్తి. మరి బాలీవుడ్‌లో తన స్థానం పటిష్టం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టులు కీర్తికి ఎంతగా ఉపయోగపడతాయో చూడాలి.

Tags

Next Story