ఎట్టకేలకు స్టార్ కపుల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు !

ఎట్టకేలకు స్టార్ కపుల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు !
X
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తాము తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. “మా జీవితంలో అత్యుత్తమ అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆనందం, కృతజ్ఞత నిండిన హృదయాలతో సిద్ధమయ్యాం..” అని వారు రాసుకొచ్చారు.

గత కొంతకాలంగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గర్భం గురించి మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆమె వచ్చే నెలలో బిడ్డకు జన్మని వ్వవచ్చని కూడా వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ ఇంతకాలం మౌనంగా ఉన్నారు. అయితే, ఎట్టకేలకు ఆ జంట అధికారికంగా ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ప్రకటించారు.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తాము తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. “మా జీవితంలో అత్యుత్తమ అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆనందం, కృతజ్ఞత నిండిన హృదయాలతో సిద్ధమయ్యాం..” అని వారు రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు, విక్కీ కౌశల్ ప్రేమగా కత్రినా బేబీ బంప్‌ను పట్టుకున్న ఒక చిత్రాన్ని కూడా షేర్ చేశారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 42 ఏళ్ల కత్రినా, తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. ఇది ఈ జంటకు మొదటి సంతానం. కుటుంబ జీవితం, మాతృత్వంపై దృష్టి పెట్టడం కోసం కత్రినా గత రెండు సంవత్సరాలుగా సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంది.



Tags

Next Story