కార్తిక్ ఆర్యన్ ఫాంటసీ మూవీ ‘నాగ్ జిల్లా’

కార్తిక్ ఆర్యన్ ఫాంటసీ మూవీ ‘నాగ్ జిల్లా’
X
"నాగ్‌జిల్లా" అనే వెరైటీ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. 2026 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది.

ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ నుంచి ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రకటించారు. "నాగ్‌జిల్లా" అనే వెరైటీ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. 2026 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. "ఫుక్రే" సిరీస్‌కు పేరొందిన మృగ్‌దీప్ సింగ్ లంబా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కార్తిక్‌కు ధర్మాతో రెండో ప్రాజెక్ట్, మొదటిది "తూ మేరీ మైం తేరా, మైం తేరా తూ మేరీ". అలాగే, ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కరణ్ ఓ మోషన్ పోస్టర్‌తో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తిక్ చొక్కా లేకుండా.. ఆకుపచ్చ పాము చర్మపు శరీరంతో వెనుకకు తిరిగిన ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ డార్క్ ఫాంటసీ సినిమా ఒక అడ్వెంచరస్ మోడ్ ను సూచిస్తోంది. కరణ్ తన క్యాప్షన్‌లో "ప్రేమవదేశ్వర్ ప్యారే చంద్" నాగ పంచమి రోజున థియేటర్లలోకి వస్తాడని చమత్కరించారు.

అభిమానులు ఈ ప్రకటనతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. కొందరు విడుదల తేదీ చాలా దూరంలో ఉందని, అయితే ప్రకటన మాత్రం తొందరగా చేశారని జోక్ చేశారు. కార్తిక్‌ కొత్త లుక్, సినిమా విభిన్న కథాంశం భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఆసక్తికరంగా, వరుణ్ ధవన్ నటించిన "భేడియా 2" కూడా అదే రోజు, ఆగస్టు 14, 2026న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతాయా లేక ఒకటి తేదీ మారుతుందా అనేది చూడాలి.

Tags

Next Story