హిందీ ‘మిరాయ్’ కు బాగా హైప్ ఇస్తున్నాడు!

హిందీ ‘మిరాయ్’ కు బాగా హైప్ ఇస్తున్నాడు!
X
బాలీవుడ్ టాప్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా హిందీలో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ముంబైలో తాజాగా "మిరాయ్" ప్రమోషన్స్‌లో పాల్గొన్న కరణ్, ఈ సినిమా వరల్డ్-బిల్డింగ్, అద్భుతమైన కథనం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.

"మిరాయ్" టాలీవుడ్ లో మరో భారీ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. "సూపర్ యోధ" అనే సూపర్‌హీరో పాత్రలో తేజ సజ్జా నటిస్తున్న ఈ చిత్రం.. అతని మునుపటి పాన్-ఇండియా హిట్ "హనుమాన్" విజయం తర్వాత వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో యంగ్ హీరో తన మార్కెట్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నాడు.

బాలీవుడ్ టాప్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా హిందీలో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ముంబైలో తాజాగా "మిరాయ్" ప్రమోషన్స్‌లో పాల్గొన్న కరణ్, ఈ సినిమా వరల్డ్-బిల్డింగ్, అద్భుతమైన కథనం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.

పౌరాణిక అంశాలను సూపర్‌హీరో ఎలిమెంట్స్‌తో మేళవించిన "మిరాయ్"లో శ్రీరాముడి పాత్ర కీలకంగా ఉంటుంది. శ్రీరాముడి పాత్ర కోసం మహేష్ బాబు ఏఐ-జనరేటెడ్ లుక్ ఉపయోగించారనే పుకార్లు వచ్చినప్పటికీ, తేజ సజ్జా వాటిని ఖండించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. "మిరాయ్" సెప్టెంబర్ 12న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Tags

Next Story