‘రామాయణం’ చిత్రం కోసం రెడీ అవుతోన్న రాకింగ్ స్టార్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్రలో నటించ నున్నట్లు ఇటీవల ధృవీకరించాడు. తాజా సమాచారం ప్రకారం, యశ్ మార్చి నెల నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్టుకు యశ్ నటుడిగానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించనున్నాడు. ఈ పాత్ర గురించి ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడినప్పుడు.. యశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
"ఒక పాత్రను పాత్రలా ఆవిష్కరించాలి. ఇది జరిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది. అటువంటి భారీ బడ్జెట్‌తో సినిమా తీయాలంటే.. అందుకు తగిన గొప్ప నటులు కలిసి రావాలి. రావణుడి పాత్ర చాలా విభిన్నంగా చూపించడానికి విస్తృతమైన అవకాశముంది," అని యశ్ అన్నాడు. అంతేకాదు, ఇది తన కెరీర్‌లో అత్యంత అద్భుతమైన, ఉత్తేజ పూరితమైన పాత్ర అని కూడా పేర్కొన్నాడు.
ఇక రామాయణం కాకుండా.. యశ్ మరో భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ లోనూ నటిస్తున్నాడు. మలయాళ దర్శకురాలు .. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యశ్ చివరిసారిగా 2022లో విడుదలైన ‘కేజీఎఫ్ 2’ తో పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించాడు. మరి రావణుడి పాత్రలో యశ్ ఏ విధంగా అలరించనున్నాడో తెలియాలంటే.. అభిమానులు మరికొన్ని నెలలు ఎదురుచూడాల్సిందే!
-
Home
-
Menu