కంగనా-జావేద్ అఖ్తర్ వివాదానికి ముగింపు

కంగనా-జావేద్ అఖ్తర్ వివాదానికి ముగింపుఐదేళ్లుగా నడిచిన కోర్టు కేసుకు ముగింపు పలుకుతూ, నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్.. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ పరస్పరంగా తమపై ఉన్న దావాలను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని కంగనా తన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. జావేద్ అఖ్తర్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను షేర్ చేశారు.
“ నేను, జావేద్ జీ మా చట్టపరమైన వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించు కున్నాము. ఈ ప్రక్రియలో జావేద్ జీ ఎంతో దయతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. అంతేకాక, నా తదుపరి దర్శకత్వం వహించనున్న సినిమాకు పాటలు రాయడానికి అంగీకరించారు” అని కంగనా తన పోస్టులో పేర్కొన్నారు.
2020 లో జావేద్ అఖ్తర్ కంగనా తనను అవమాన పరచినందుకు వ్యాజ్యం దాఖలు చేశారు. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో తన గురించి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారని.. ఇది భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ప్రారంభమైంది.
దీనికి ప్రతిస్పందనగా.. కంగనా కూడా జావేద్ అఖ్తర్‌పై ఫిర్యాదు చేస్తూ, ఆయన తనను బలవంతంగా ఒత్తిడి చేయడం.. తన గోప్యతను ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే, చివరికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాదానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పారు.
-
Home
-
Menu