కాజోల్ మైథలాజికల్ హారర్ మూవీ ‘మా’

కాజోల్ మైథలాజికల్ హారర్ మూవీ ‘మా’
X

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తన లేటెస్ట్ మూవీ మైథలాజికల్ హారర్ ‘మా’ కోసం అభిమానులను ఉత్కంఠగా ఎదురుచూసేలా చేసింది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆమె విడుదల చేయడంతో పాటు.. బ్యాటిల్ బిగిన్స్ ఆన్ 27 జూన్ 2025, ఇన్ సినిమాస్ నియర్ యూ... అంటూ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకుంది. ఈ అద్భుతమైన కథలో క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

‘మా’ సినిమాలో కాజోల్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆమెతో పాటు రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేంగుప్త, ఖేరిన్ శర్మ వంటి ప్రతిభావంతమైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మోషన్ పోస్టర్ చూస్తే ఇది భయానక తత్వంతో కూడిన మైథలాజికల్ కథ అని అర్థమవుతోంది. దుష్టశక్తి, దైవశక్తి మధ్య జరిగే ఘర్షణను ప్రేక్షకులు స్క్రీన్ మీద అద్భుతంగా ఆస్వాదించనున్నారు.

ఈ చిత్రానికి విశాల్ ఫూరియా దర్శకత్వం వహిస్తుండగా.. సైవిన్ క్వాడ్రాస్ కథను అందించారు. మైథాలాజీ, హారర్‌ సమ్మిళితంగా మలిచిన ఈ కథ, ప్రేక్షకులను కుర్రి గుండెలకు గుబులు కలిగించేలా రూపొందించబడింది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిల్మ్స్ సమర్పిస్తుండగా.. అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, బెంగాళీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Tags

Next Story