ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక

ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక
X
ఇప్పుడు జ్యోతిక మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్ డైరెక్టర్ అశ్విని అయ్యర్ తివారీ రూపొందిస్తున్న ఓ కోర్టు రూమ్ డ్రామాలో జ్యోతిక లీడ్ రోల్‌లో కనిపించనుంది.

సౌత్ ఇండస్ట్రీస్ లో తన నటనా ప్రతిభతో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక, కొంత కాలం కుటుంబ జీవితానికి పరిమితమైంది. ఆ తర్వాత.. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాలీవుడ్‌లో ఫుల్ జోష్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ వంటి పవర్‌ఫుల్ కథాంశాలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె ఎంచు కుంటున్న క్యారెక్టర్స్, స్టోరీలు ఆమెలోని వెర్సటైల్ నటిని మరోసారి రుజువు చేస్తున్నాయి.

ఇప్పుడు జ్యోతిక మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్ డైరెక్టర్ అశ్విని అయ్యర్ తివారీ రూపొందిస్తున్న ఓ కోర్టు రూమ్ డ్రామాలో జ్యోతిక లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఈ లీగల్ థ్రిల్లర్‌ను బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జ్యోతికతో పాటు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటిస్తోంది, ఇది ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షి మధ్య కోర్టు రూమ్‌లో జరిగే ముఖాముఖి సీన్స్ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందించనున్నాయని టాక్. భావోద్వేగాలతో కూడిన ఈ కోర్టు రూమ్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను కట్టిపడేసే స్టోరీలైన్‌ను కలిగి ఉంటుందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు సమాచారం, అమెజాన్ ప్రైమ్ విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, టైటిల్, రిలీజ్ డేట్ వంటివి త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

Tags

Next Story