స్టార్ కిడ్స్ జోడీగా బాలీవుడ్ లో కొత్త ప్రేమకథ !

బాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ కిడ్స్ యుగం ప్రారంభమైంది. కపూర్, ఖాన్ కుటుంబాలు మరో తరానికి సినీ వారసత్వాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, లేటు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ల జోడీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ తమ యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, సిల్వర్ స్క్రీన్ పై అఫీషియల్ ఎంట్రీ ఇస్తున్నారు.
తమిళ హిట్ మూవీ లవ్ టుడే రీమేక్‌గా వస్తున్న ‘లవ్యాపా’ అనే చిత్రంలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, ఈ ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారనుంది. మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ అంచనాలు పెంచింది. జునైద్ ఖాన్ నటించిన మహారాజా, ఖుషీ కపూర్ నటించిన ద ఆర్చిస్ ఓటీటీలో ప్రేక్షకులను అలరించినప్పటికీ.. ‘లవ్యాపా’ ద్వారా వీరు తొలిసారి బిగ్ స్క్రీన్ అనుభవాన్ని పొందుతున్నారు.
ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్, ఫాంటోమ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రమోషన్లలో భాగంగా చిత్రంలోని పాటలను వరుసగా విడుదల చేస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన కౌన్ కిన్నా జరూరీ సి అనే ఎమోషనల్ సాంగ్ ఇప్పటికే మంచి స్పందన పొందింది. మరి ఈ రొమాంటిక్ డ్రామా ఇద్దరు స్టార్ కిడ్స్‌కు హిట్ అందిస్తుందా, వారి సినీ ప్రయాణానికి గట్టి పునాది వేస్తుందా అనేది వేచిచూడాలి.
-
Home
-
Menu