‘జాన్ విక్ ’ ఐదోసారి వస్తున్నాడు !

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘జాన్ విక్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో కినూ రీవ్స్ నటించిన ఈ సిరీస్‌కు విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు, దీనికి దర్శకత్వం వహించిన చాద్ స్టెహెల్స్కీ తాజాగా జాన్ విక్ 5 ప్రొడక్షన్‌లో ఉన్నదని ధృవీకరించాడు. ఈ సినిమా 2026 చివరి నాటికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటీవలి ఎంఫైర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చాద్ స్టెహెల్స్కీ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "జాన్ విక్ 5 చాలా ధైర్యంగా, ఊహించని మార్గంలో సాగుతుంది. గత సినిమాల మాదిరిగా 'హై టేబుల్' కథాంశం ఇప్పుడు ఉండదు. పూర్తిగా కొత్త దిశగా వెళ్లే కథ," అని అన్నారు. ఇంకా, జాన్ విక్ లెగసీ దాదాపుగా ముగింపునకు చేరుకుంటుందని సంచలన వ్యాఖ్య చేశారు.
ఈ కొత్త భాగం పూర్తిగా స్టాండ్‌అలోన్ ఫిల్మ్ అని తెలిపారు. అంటే, గత సినిమాలకు కలసిపోయిన కథ కాకుండా, ఒక కొత్త కథనం. కినూ రీవ్స్ ఈ సినిమాలో పునఃప్రవేశం చేయనున్నప్పటికీ, అతను మునుపటిలా ‘బాబా యాగా’గా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ, త్వరలో విడుదలయ్యే థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా టోన్, కొత్త కథాంశానికి సంబంధించిన క్లారిటీ ఇస్తుందన్న నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
-
Home
-
Menu