హిందీ సినిమా సీక్వెల్ పై హింట్ ఇచ్చిన స్టార్ హీరోలు!

2011లో విడుదలై ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన బాలీవుడ్ క్లాసిక్ ‘జిందగీ న మిలేగీ దొబారా’ కు సీక్వెల్ రానుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. అభిమానులకు సీక్వెల్‌పై భారీ హింట్ ఇచ్చారు.
ఈ ముగ్గురు హీరోలు ఒక రెస్టారెంట్‌లో కలుసుకుని, త్రీ మస్కటీర్స్ నవలను చూస్తూ, “అన్‌బిలీవబుల్, ఔట్‌స్టాండింగ్” అని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఫర్హాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. “జోయా అక్తర్.. నీకేమైనా సిగ్నల్స్ కనిపిస్తున్నాయా?” అని సరదాగా వ్యాఖ్యానించాడు. దీనికి జోయా అక్తర్ “అవును, యూనివర్స్ నాతో మాట్లాడుతోంది” అంటూ సరదా రిప్లై ఇచ్చింది.
ఈ పోస్టుపై అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థల అధికారిక అకౌంట్లు స్పందించడం విశేషం. ఈ వీడియో ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రంలోని ఫేమస్ సాంగ్ సెనోరిటా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ.. అభిమానులలో నోస్టాల్జియాను పెంచింది.
2011 జూలై 15న విడుదలైన ఈ సినిమా ముగ్గురు చిన్ననాటి స్నేహితులు జీవితాలను ఆవిష్కరించింది. జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హృతిక్, ఫర్హాన్, అభయ్‌ల నటనతో పాటు కత్రినా కైఫ్, కల్కి కొచ్లిన్ పాత్రలు కూడా అభిమానులను మెప్పించాయి. దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సీక్వెల్.. ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.
-
Home
-
Menu