కేన్స్ రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ !

బాలీవుడ్ అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ తన సినీ ప్రస్థానంలో వేగంగా ముందుకెళ్తోంది. ఇటీవల ఆమె "దేవర" వంటి సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం రామ్ చరణ్ కు జోడీగా “పెద్ది” అనే చిత్రంలో నటిస్తోంది. ఇంతలో ఆమెకు మరో గొప్ప అవకాశమొచ్చింది. జాన్వీ వచ్చే నెలలో ప్రెస్టీజియస్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరై.. రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం పొందింది. ఇది ఆమెకు కేన్స్‌లో తొలి హాజరైతే.. అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకునే దిశగా మరో కీలకమైన అడుగది.
జాన్వీ నటించిన బాలీవుడ్ చిత్రం "హోంబౌండ్" ను ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ తెరకెక్కించారు. ఆయన హైదరాబాద్ వాస్తవ్యుడు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం.
ఒక సమయంలో జాన్వీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమని కొందరు విమర్శించారు. కానీ ఇప్పుడు ఆమె నటనకు అవకాశమిచ్చే మంచి పాత్రలతో బాలీవుడ్‌నే కాదు, తెలుగు సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటోంది. ఒక యువతారగా ఆమె చేయూతగా కేవలం కుటుంబ నేపథ్యమే కాదు, ప్రతిభను కూడా నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. జాన్వీ కపూర్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరుస్తూ.. భారతీయ సినీ ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై ప్రతినిధిగా నిలవబోతోంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో మరొక గొప్ప మైలురాయి.
-
Home
-
Menu