పెళ్ళిచేసుకొని తిరుపతిలో సెటిల్ అవ్వాలని నా కోరిక : జాన్వీ కపూర్

పెళ్ళిచేసుకొని తిరుపతిలో సెటిల్ అవ్వాలని నా కోరిక : జాన్వీ కపూర్
X
“ముగ్గురు పిల్లల్ని కనాలని, అరిటాకులో భోజనం చేస్తూ, గోవింద నామస్మరణతో నా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉంది,”

బాలీవుడ్ బ్యూటీ .. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిలోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన నటి‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ‘దేవర’ చిత్రం ద్వారా దగ్గరైంది. అంతేకాదు.. తరుచూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే సంప్రదాయం వల్ల ఆమెకు తెలుగు ప్రేక్షకులతో మరింత అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తోంది.

ఇప్పటివరకు కెరీర్‌పై దృష్టి పెట్టిన జాన్వీ కపూర్.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పెళ్లి చేసుకుని తిరుపతి నగరంలో నివసించాలని తన కోరిక అని చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. “ముగ్గురు పిల్లల్ని కనాలని, అరిటాకులో భోజనం చేస్తూ, గోవింద నామస్మరణతో నా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉంది,” అంటూ తన ఆకాంక్షలను పంచుకుంది.

అంతేకాదు, తన భర్తకు లుంగీ ధరించమని చెబుతానని జాన్వీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. వ్యక్తిగత జీవితంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story