జాన్వీ కపూర్ హిందీ సినిమా వాయిదా!

జాన్వీ కపూర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర పార్ట్ 1 విజయంతో ఆమె కెరీర్ కొత్త ఊపును అందుకుంది. ఈ నేపథ్యంలో, జాన్వీ ఇప్పుడు వరుసగా పలు సినిమాలకు సైన్ చేసింది. వీటిలో ఆమె కమిట్ అయిన వెరైటీ ప్రాజెక్ట్ 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి. ఇందులో ఆమె వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.
కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యమైన కారణంగా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ఇది జాన్వీ, వరుణ్ తొలిసారిగా జోడీ కడుతున్న సినిమా కావడం విశేషం.
ఇక మరోవైపు, జాన్వీ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. ఈ సినిమాకు బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించనుండగా, మ్యూజిక్ మేస్త్రో ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మరి 'సన్నీ సంస్కారీ కా తులసి కుమారి' ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu