బాలీవుడ్ లో అసలు కాలం కలిసిరావడం లేదు !

బాలీవుడ్ లో అసలు కాలం కలిసిరావడం లేదు !
X
2025లో ఆమె నటించిన మూడు హిందీ సినిమాలు థియేటర్‌లలో రిలీజ్ అయ్యాయి, కానీ మూడూ అంచనాలు అందుకోలేదు.

ప్రస్తుతం ఇండియన్ స్ర్కిన్ పాపులర్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరైనప్పటికీ, ఆమె స్టార్‌డమ్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. యూత్‌లో మంచి క్రేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్నా.. ఆమె సినిమాలు టికెట్ కౌంటర్ల వద్ద కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించాలంటే కేవలం ఆమెకున్న క్రేజ్ సరిపోదని మరోసారి తేలిపోయింది.

2025లో ఆమె నటించిన మూడు హిందీ సినిమాలు థియేటర్‌లలో రిలీజ్ అయ్యాయి, కానీ మూడూ అంచనాలు అందుకోలేదు. ఈ మూడింటిలో మొదట రిలీజైన సినిమా "పరం సుందరి". ఇందులో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇండియాలో ఇది సుమారు ₹50 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది ఆమె గత సినిమాల కంటే కొంచెం బెటర్ అయినా, అండర్‌పెర్ఫార్మ్ అయినట్టే.

జాన్వీ కపూర్ రెండో రిలీజ్ "హోమ్‌బౌండ్". ఇది ఈ ఏడాది ఆస్కార్స్‌కి ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయ్యింది. ఇది కొన్ని ప్రత్యేకమైన ఆడియన్స్ కోసం తీసిన నైష్ ఫిల్మ్ కావడంతో, గత నెలలో థియేటర్‌లలో రిలీజైనప్పుడు కనీసం ఓ మోస్తరు కలెక్షన్లను కూడా సాధించలేకపోయింది.

గత వారాంతంలో ఆమె మూడో సినిమా "సన్నీ సంస్కారి కీ తులసి కుమారి" వచ్చింది. ఇందులో హీరోగా నటించిన వరుణ్ ధావన్‌కి కూడా పాపులారిటీ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పటికే "కాంతార చాప్టర్ 1" సినిమా బాక్సాఫీస్‌ని డామినేట్ చేస్తుండటంతో, "సన్నీ సంస్కారి కీ తులసి కుమారి" నిలబడలేకపోయింది.

ఈ సినిమా మొదటి వీకెండ్‌లో కేవలం ₹30 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. మొత్తానికి, 2025లో జాన్వీ కపూర్ హిందీలో చేసిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అందుకే, వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే "పెద్ది" సినిమాపైనే ఆమె ఇప్పుడు ఆశలు పెట్టుకోవాలి.

Tags

Next Story