జాన్వీ ‘పరమ్ సుందరి’ టాక్ ఏంటి?

అందాల జాన్వీ కపూర్, హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా నటించిన బాలీవుడ్ మూవీ “పరమ్ సుందరి” తాజాగా.. థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రివ్యూలు కూడా వచ్చేసాయి. కానీ సినిమా గురించి అందరి అభిప్రాయాలు ఒకేలా లేవు. యన్డీటీవీ ఈ సినిమాను షారుఖ్ ఖాన్ సినిమాల కాక్టెయిల్‌లా ఉందని చెప్పింది. అంటే కాస్త ఓల్డ్ స్కూల్ షారుఖ్ వైబ్‌లు కనిపిస్తాయనమాట.
ఇంకా చాలా రివ్యూలు చూస్తే. ఈ సినిమా మీద మిశ్రమ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది విమర్శకులు కథ కాస్త ఊహించేసినట్టు.. పాత ఫార్ములానే ఫాలో అయినట్టు ఫీల్ అయ్యారు. కానీ జాన్వీ కపూర్‌కి మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఆమె స్క్రీన్ మీద టోటల్ గ్లామరస్‌గా కనిపించడమే కాక, నటనలో కూడా సూపర్ సిన్సియర్‌గా ఇరగదీసిందని చెప్పుకుంటున్నారు. ఒక క్రిటిక్ అయితే ... “జాన్వీలో ఒక నిశ్శబ్దమైన, నిజమైన ఎమోషన్ కనిపిస్తుంది. అది ఆమె పెర్ఫార్మెన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిం...” అంటూ అభిప్రాయపడ్డాడు.
అయితే, ఈ సినిమాకి ఆ వైరల్ సాంగ్ “పరదేశియా” ఉన్నా.. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా స్టార్మ్ క్రియేట్ చేయలేకపోయింది. అంతేకాదు, పూర్తిగా రిజెక్ట్ కూడా కాలేదు, జస్ట్ మిడ్‌లో ఎక్కడో సెటిల్ అయినట్టుంది. ఈ వీకెండ్‌లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో, అది చూస్తేనే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ.
-
Home
-
Menu