జాన్వీ దిండు రహస్యం ఏంటో !

జాన్వీ దిండు రహస్యం ఏంటో !
X
ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసినప్పుడు.. ఆమె సిబ్బందిలో ఒకరు ఆమె వ్యక్తిగత దిండును మోస్తూ కనిపించారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

బాలీవుడ్ అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి.. ఆమె దిండు కారణంగా.. వార్తల్లో నిలిచింది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసినప్పుడు.. ఆమె సిబ్బందిలో ఒకరు ఆమె వ్యక్తిగత దిండును మోస్తూ కనిపించారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ గల, సంపన్న తారల్లో ఒకరైన జాన్వీ, ఎందుకు తన సొంత దిండును ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్తుందని అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏ గమ్యస్థానంలోనైనా ఆమె సులభంగా కొత్త దిండు కొనుగోలు చేయవచ్చు కదా. జాన్వీకి తన దిండు విషయంలో చాలా ప్రత్యేకమైన సౌకర్యం అవసరమని తెలుస్తోంది. అందుకే అది ఆమె ప్రయాణాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటుంది.

ప్రస్తుతం, జాన్వీ తన రాబోయే బాలీవుడ్ చిత్రం “పరమ్ సుందరి” ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. అలాగే.. ఆమె రామ్ చరణ్ మోస్ట్ అవైటింగ్ “పెద్ది” చిత్రంలో కూడా నటిస్తోంది. మరి జాన్వీ దిండు రహస్యం ఏంటో? అది ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి.

Tags

Next Story