తల్లి సూపర్ హిట్ మూవీ రీమేక్ లో జాన్వీ?

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్‌కి వరుసగా ఆసక్తికర సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇంకా తన కెరీర్‌లో అతిపెద్ద హిట్ అందుకోనప్పటికీ, ఆమె ఎన్నో హైప్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లలో భాగం కాబోతోంది. తాజా బజ్ ఏంటంటే.. ఆమెను శ్రీదేవి సూపర్ హిట్ మూవీ ‘చాల్‌బాజ్’ రీమేక్ కోసం సంప్రదించారట. ఈ ప్రాజెక్ట్‌పై జాన్వీ ఎగ్జైటెడ్‌గా ఉన్నప్పటికీ.. ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తోంది.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, ఈ నెలలో జాన్వీ తన నిర్ణయాన్ని తీసుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నిర్మాత, దర్శకుడి వివరాలు ఇంకా బయటకు రాలేదు. జాన్వీని కలవడానికి ముందు ఈ టీమ్ బోనీ కపూర్‌ని పలుమార్లు సంప్రదించిందట. తన తల్లి శ్రీదేవి క్రేజ్‌ని ఎప్పుడూ క్యాష్ చేసుకోవాలని జాన్వీ ఆలోచించలేదు.
ఇక సౌత్‌లోకి వస్తే.. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే, అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలోనూ జాన్వీ ఒక హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
-
Home
-
Menu